మార్గదర్శి బాగోతాలు బట్టబయలు.. కీలక విషయాలు వెల్లడించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

13 Mar, 2023 13:32 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బును అక్రమంగా దారిమళ్లిస్తున్నారని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు. తనిఖీలకు యాజమాన్యం సహకరించడం లేదన్నారు. మార్గదర్శిలో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని పేర్కొన్నారు. తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో వినియోగదారుడికి తెలియడం లేదన్నారు.

'మార్గదర్శి అక్రమాలకు సంబందించి ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశాం. ఏపీ వినియోగదారుల సొమ్మును వేరే చోటుకు తరలిస్తున్నారు. చెక్‌ పవర్ లేని వ్యక్తిని ఇక్కడ బాధ్యుడిగా ఉంచుతున్నారు. చిట్ వేసే వారి పరిరక్షణ కోసం చిట్‌ఫండ్ చట్టం ఉంది. కానీ మార్గదర్శిలో జవాబుదారీతనం లేని పరిస్థితి ఉంది. చిట్ ఫండ్‌ సొమ్మును ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు. బ్రాంజ్ మేనేజర్‌కు సంస్థ సమాచారం గానీ, పవర్‌గానీ లేదు.

తప్పుడు రికార్డులతో చిట్స్ నడిపిస్తున్నారు. వినియోగదారులకు సమయానికి డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశాము. విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ కి రిమాండ్ విధించారు. విజయవాడ మేనేజర్ శ్రీనివాసరావుకి 12 రోజులు రిమాండ్ ఇచ్చారు. గుంటూరు బ్రాంచ్ మేనేజర్‌కి రిమాండ్ ఇవ్వలేదు.' అని సంజయ్ వివరించారు.
చదవండి: వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్

మరిన్ని వార్తలు