సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు

15 Aug, 2021 04:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్వాతంత్య్రదిన వేడుకలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబయింది. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో మెరిసిపోతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు సీఎంవోలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సీఎంవో ముఖ్య అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.  

మరిన్ని వార్తలు