ఆమె విజయం.. ఏపీకి మరో అపూర్వ ఘట్టం: సీఎం జగన్‌

2 Oct, 2023 12:09 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆసియా క్రీడలు 2023 మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించిన జ్యోతి యార్రాజీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. జ్యోతి విజయం.. ఆంధ్రప్రదేశ్‌కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్వీట్‌ ద్వారా ప్రశంసలు గుప్పించారు. 

జ్యీతి అంకితభావం, కృషి..  ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశం గర్వించేలా చేసింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన జ్యోతికి అభినందనలు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది అంటూ  సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు