గాంధీ వర్ధంతి.. ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం జగన్‌

30 Jan, 2023 13:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి :  జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. నివాళులు అర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్‌ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు, నా రాష్ట్రానికి, అతను ఎప్పటికీ మనకు ప్రియమైన గాంధీ తాతా అని ట్వీట్‌ చేశారు.

జనవరి 30, 1948లో గాంధీజీ అమరులయ్యారు. దేశం కోసం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ రోజును ‘అమరవీరుల దినోత్సవం’గా కూడా పాటిస్తారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు