తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్‌ బర్త్‌డే విషెస్‌

17 Feb, 2023 17:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు:  ఇవాళ(ఫిబ్రవరి 17)న బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు సీఎం జగన్‌ ఒక ట్వీట్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు