గడప గడపకు మన ప్రభుత్వం: నిర్లక్ష్యం వద్దు.. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

28 Sep, 2022 20:30 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా..  ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,  పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు. 

గ్రామ/వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సీఎం జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గడప గపడకు.. పై గత సమీక్ష కన్నా ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు మాత్రం తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 175 సీట్లకు 175 కొట్టాలి. ఒక్క సీటు మిస్‌ కావొద్దు. ప్రతి ఇంటికి వెళ్లాలి. నెలలో కనీసం పదహారు రోజులు గ్రామాల్లో ఉండాలి. వంద శాతం ఇళ్లను కవర్‌ చేయాలి. ఎమ్మెల్యేగా ఓడితే గౌరవం తగ్గుతుంది. కష్టపడితే గెలుపు దక్కుతుంది. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్‌ను రీచ్‌ కావాలి అని ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కార్యకర్తలతో సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం జగన్‌ ప్రజా ప్రతినిధులకు ఇవాళ్టి సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్!

మరిన్ని వార్తలు