సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే.. ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి

15 Jul, 2022 19:11 IST|Sakshi

Live Updates:

6:00 PM
గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.
ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష.
ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్‌
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియామకం
వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం

4: 24 PM
గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

► వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్

గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష

ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

► గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించనున్నారు.

► విశాఖపట్నంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌ సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు.

ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు