వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి: సీఎం జగన్‌

16 Aug, 2022 15:40 IST|Sakshi

సీఎం జగన్‌ అచ్యుతాపురం పర్యటన.. అప్‌డేట్స్‌

ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా సహకారం

జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం

15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగాం

ప్రభుత్వం ఇచ్చే సహకారంతో సెకండ్‌ ఫేజ్‌కు ముందుకొచ్చారు

ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేసే అవకాశం

ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం

వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి

►  రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు

మూతపడ్డ ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నాం

ఎంఎస్‌ఎమ్‌ఈల పునరుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం.

రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.

► రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయి.

అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు

విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు

సీఈవో నితిన్‌ కామెంట్స్‌

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని సీఈవో నితిన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లాంట్‌గా యూనిట్‌ను తయారు చేస్తామని సీఈవో నితిన్‌ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

► ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్‌

► ఏటీసీ టైర్ల పరిశ్రమను పరిశీలిస్తున్న సీఎం జగన్‌.. కంపెనీ ప్రతినిధులతోనూ మాట్లాడుతున్నారు.

అచ్యుతాపురం సెజ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌..

సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం జగన్‌

అచ్యుతాపురం సెజ్ కి చేరుకున్న సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అచ్యుతాపురం సెజ్‌కు చేరుకున్నాడు.  అక్కడి ఏటీసీ టైర్ల కంపెనీలోని హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. 

► ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, అనకాపల్లి ఎంపి సత్యవతితో పాటు స్వాగతం పలికిన వాళ్లలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,  జిల్లా కలెక్టర్ రవి సుభాష్, డి. ఐ. జి హరికృష్ణ,ఎస్పీ గౌతమీ శాలి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు యువి కన్నబాబు రాజు, పెట్ల ఉమాశంకర్  గణేష్, గొల్ల బాబూరావు, అన్నoరెడ్డి అదీప్ రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్,మాజీ డీసిసిబి చైర్మన్ సుకుమారవర్మ, గవర కార్పోరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, విశాఖ డెయిరీ వైస్ చైర్మన్ మరియు విశాఖ వెస్ట్ ఇన్ ఛార్జి ఆడారి ఆనంద్ తదితరులు ఉన్నారు.

► అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో.. రూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌.

► అచ్యుతాపురం సెజ్‌లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేయనున్న సీఎం జగన్‌.

► కాసేపట్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి సీఎం జగన్‌. ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం జగన్‌.

► అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు తొలుత చేరుకుంటారు. 

► అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారు.  ఎస్‌ఈజెడ్‌లో పలు భారీ పరిశ్రమలకు శ్రీకారం చుట్టడానికి, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 

పర్యటనలో భాగంగా.. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో గల ఏటీసీ టైర్ల పరిశ్రమ వద్దకు చేరుకుంటారు.  ముందుగా స్థానిక నేతలతో ఆయన ముచ్చటిస్తారు. ఆపై అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో పలు భారీ పరిశ్రమలకు శ్రీకారం చుడతారు. 

► ముందుగా పరిశ్రమలో మాన్యుఫ్యాక్చరింగ్‌  యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఏటీసీ టైర్ల కంపెనీ రెండూ ఫేజ్‌కు, మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు. 

► తిరిగి మధ్యాహ్న సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు, కోడల్ని సీఎం జగన్‌ ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

అచ్యుతాపురం, రాంబిల్లి క్లస్టర్‌ సెజ్‌కు 2000 సంవత్సరం తర్వాత అడుగులు పడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ సెజ్‌కు కీలక అనుమతులు వచ్చాయి. మొత్తం ఆరు వేల ఎకరాలను సేకరించారు.

ఈ ప్రత్యేక ఆర్థిక మండలికి సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండటం ప్లస్‌ పాయింట్‌. ఇప్పటి వరకూ 60 వేల మందికి ఈ సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పించారు. విశాఖ–చెన్నై కోస్టల్‌ కారిడార్‌లో అచ్యుతాపురం సెజ్‌కు కీలక స్థానం ఉందనే చెప్పాలి. పూడిమడక వద్ద ఏర్పాటు కానున్న హార్బర్‌ ద్వారా మరిన్ని దేశాలతో ఈ సెజ్‌ తన కార్యకలాపాల్ని విస్తరించనుంది.

► ఇప్పటికే బార్క్, బ్రాండిక్స్, ఆసియన్‌ పెయింట్స్‌ వంటి బ్రాండెడ్‌ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సెజ్‌లో యకహోమా కంపెనీ రూ.1,200 కోట్లతో తన కార్యకలాపాల్ని మంగళవారం ప్రారంభించనుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు