ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

11 Jun, 2021 16:47 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని 3 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం గన్నవరం నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలిశారు. వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశం సాగింది. అలాగే శుక్రవారం ఉదయం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం భేటీ అయ్యారు.
 

చదవండి: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్ భేటీ
పోలవరం పనులపై కేంద్రం ప్రశంస

మరిన్ని వార్తలు