ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సీఎం జగన్‌ భేటీ

2 Jun, 2022 21:26 IST|Sakshi

Updates

కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు.

ప్రధానితో ముగిసిన సీఎం జగన్‌ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు.

ప్రధానితో భేటీ..
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 5.30కి కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం భేటీ కానున్నారు.

 సీఎం జగన్‌కు ఘన స్వాగతం
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో బయల్దేరిన సీఎం జగన్‌.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన విమానంలో బయలుదేరారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం జగన్‌.  

మరిన్ని వార్తలు