CM Jagan Delhi Tour: ఢిల్లీలో సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్‌ అభ్యర్థులు

30 Apr, 2022 07:50 IST|Sakshi
సీఎం జగన్‌ను కలిసి ఏపీలో నాడు–నేడు స్కూళ్ల అభివృద్ధిపై ధన్యవాదాలు తెలుపుతున్న ఏపీ సివిల్స్‌ కోచింగ్‌ విద్యార్థులు

నేడు విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే సీఎం, హైకోర్టుల సీజేల సదస్సుకు హాజరు 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిధున్‌రెడ్డి, ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి తదితరులు స్వాగతం పలికారు.

శనివారం ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో సీఎం జగన్‌ పాల్గొంటారు. సదస్సును ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభిస్తారు. కాగా, తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌కు బదులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 

చదవండి: (కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి గుడివాడ అమరనాథ్‌)

మరిన్ని వార్తలు