డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

29 Nov, 2021 09:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.
చదవండి: డాలర్‌ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మరిన్ని వార్తలు