YS Jagan Gollaprolu Visit Updates: మూడో విడత నగదు విడుదల

29 Jul, 2022 19:01 IST|Sakshi

కాపు నేస్తం మూడో విడత కార్యక్రమం.. అప్‌డేట్స్‌

12:27PM
వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధుల జమ
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సీఎం జగన్‌
అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయం

11: 55AM
వైఎస్సార్‌ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాం: సీఎం జగన్‌
మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ. 45 వేలు ఇచ్చాం: సీఎం జగన్‌
ఇప్పటివరకూ వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం: సీఎం జగన్‌
నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి: సీఎం జగన్‌
నాన్‌ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16  వేల కోట్ల లబ్ధి: సీఎం జగన్‌
మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల లబ్ధి: సీఎం జగన్‌
కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి రూ. 508.18 ​‍కోట్ల లబ్ధి: సీఎం జగన్‌

11:49AM
మహిళా సాధికారత పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు.  మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చారని, లంచాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌ అని వంగా గీత తెలిపారు.


11:46AM 
► ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అని లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్‌ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా.

11:43 AM  

► కాపులను చంద్రబాబు మోసం చేశాడు. చాలా హింసించాడు. కాపుల సంక్షేమం కోసం ఆలోచించిన గొప్పమనసు సీఎం జగన్‌ది. మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో చాలా లబ్ధి పొందుతున్నాం. మా అందరికీ మీరు పెద్ద కొడుకుగా భావిస్తున్నాం. 

::బండారు సుజాత, కాకినాడ అర్బన్‌

11:38 AM 

కాపులు.. పవన్‌ను నమ్మొద్దు: మంత్రి దాడిశెట్టి రాజా

కాపుల కోసం గత ప్రభుత్వాలు ఎన్నో రకాల మాటలు చెప్పాయి. చేతల్లో చూపించింది శూన్యం. అధికార మదంతో కాపుల మీద కేసులు కూడా పెట్టారు. కానీ, ఈ మూడు సంవత్సరాల్లో కాపుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది. అంతేకాదు కేసుల్ని కూడా ఎత్తేయించారు. పవన్‌ కల్యాణ్‌ మోసపు మాటలను నమ్మొద్దని.. చంద్రబాబుతో చేతులు కలుపుతున్నాడని.. ఎల్లోమీడియా, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఇలా ఎందరు కలిసొచ్చినా.. కాపు సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌నే మనం మళ్లీ సీఎంగా చేసుకోవాలని పిలుపు ఇచ్చారు మంత్రి దాడిశెట్టి రాజా

11:33 AM
► కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది. రూ. 422 కోట్ల రూపాయలతో హార్బర్‌ ఇచ్చారు. అలాగే సాగరమాల రోడ్డు ప్రకటించారు. గతంలో మహానేత వైఎస్సార్‌ కూడా ఇలాగే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఉపయోగపడే మరికొన్ని పనులను పూర్తి చేయించాలని సీఎం జగన్‌ను వేదిక నుంచే కోరారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

వైఎస్సార్‌ కాపు నేస్తం మీద స్పెషల్‌ ఏవీ ప్రదర్శన


11:27 AM
► వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత కార్యక్రమంలో.. కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా అందడానికి.. పాలనా సౌలభ్యం కోసం కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినందుకు ఆమె సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు మహిళా పక్షపాతిగా ఉన్న ఆయనకు ధన్యవాదాలు చెబుతూ.. ప్రజాసంక్షేమ ఆశయానికి తగట్లుగా పని చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

11:25 AM
► మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి.. స్థానిక నేతలు, అధికారులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు సీఎం జగన్‌.

11:19 AM
► కాపు నేస్తం మూడో విడతలో..  అర్హులైన మూడు లక్షల మందికి పైగా రూ.500కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం.

► ఇప్పటివరకు వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.1,491 కోట్ల రూపాయల సాయం అందించింది సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం.

11:15 AM

► గొల్లప్రోలు సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌. ఆడపడుచులతో ఫొటోలు దిగి.. ఆప్యాయంగా పలకరించిన జగనన్న‌. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం.

11:00 AM
► హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక వరకు రోడ్‌షో. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడుత సాయం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్‌.

10:58 AM

► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్‌రెడ్డి.

10:47 AM
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

10:00 AM
► 
వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు.
► వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం అమలుకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
► కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో..  సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు జమ చేయనున్నారు. 
 రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. 
► మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నారు.

పర్యటన ఇలా.. 
► శుక్రవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరి, కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేరుకుంటారు. 
లబ్ధిదారులను ఉద్దేశించి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 
► అనంతరం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు.
► కార్యక్రమ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు