వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక: ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం ఇది!

30 Sep, 2022 17:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు ఏ ఆటంకం లేకుండా అందాలనేది జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్లే మేనిఫెస్టోను ప్రకటించి.. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. కులం, మతం, పార్టీ, ప్రాంతం.. లేకుండా అవినీతి, పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకంగా.. నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. 

రాష్ట్రంలోని వయోవృద్ధులకు, అర్హులైన ఇతరులకు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద.. నెలవారీ ఫించన్‌లను అందజేస్తోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ప్రతి నెల ప్రారంభంలో గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ను దగ్గరుండి అందజేస్తున్నారు. ఇక సెప్టెంబర్‌ 2022 నెలకు సంబంధించిన ఫించన్‌ను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు వలంటీర్లు. ఆ నగదు అక్షరాల 1,590.50 కోట్ల రూపాయలు. 

సుమారు 62.53 లక్షల మంది ఫించన్‌దారులకు ఈ నగదు పంచబోతున్నారు వలంటీర్లు. అయితే గత ఏడేళ్లలో సెప్టెంబర్‌ నెల గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. 

సెప్టెంబర్‌ 2022 -  రూ.1,590.50 కోట్లు
సెప్టెంబర్‌ 2021 - రూ.1,397 కోట్లు
సెప్టెంబర్‌ 2020 - రూ.1,429 కోట్లు
సెప్టెంబర్‌ 2019 - రూ.1,235 కోట్లు

సెప్టెంబర్‌ 2018 - రూ. 477 కోట్లు
సెప్టెంబర్‌ 2017 - రూ. 418 కోట్లు
సెప్టెంబర్‌ 2016 -  రూ. 396 కోట్లు
సెప్టెంబర్‌ 2015 -  రూ. 405 కోట్లు.. 

ఇలా గత ప్రభుత్వం మధ్యలో కోత ద్వారా పెన్షన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. అధికారంలోకి రాగానే అర్హులైన వాళ్లందరినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది . అంతేకాదు లబ్ధిదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వేల కోట్ల రూపాయలను సకాలంలో అందజేస్తూ తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది జగనన్న ప్రభుత్వం.

మరిన్ని వార్తలు