సీఎం జగన్‌ నరసరావుపేట పర్యటన.. అప్‌డేట్స్‌

7 Apr, 2022 16:33 IST|Sakshi

అప్‌డేట్స్‌:

1.10PM
రాష్ట్రంలో 2,33,333 మందికి రూ. 232 కోట్ల  నగదు పురస్కారాలు..  బటన్‌ నొక్కి నగదు విడుదల చేసిన సీఎం జగన్‌

1.00PM

నరసరావుపేటకు పాలిటెక్నిక్‌, ఆటో నగర్‌, ఫ్లైఓవర్‌లు మంజూరు చేసిన సీఎం జగన్‌

 12.20PM
వలంటీర్లకు వందనం. వలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నా. దేశం మొత్తం మనవైపు చూసేలా వలంటీర్ల వ్యవస్థ: సీఎం జగన్‌.రాష్ట్రంలో 2లక్షల 60వేలకు మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థ తీసుకురావాలనేది మా సంకల్పం. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పాలన. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు. వలంటీర్లు చేస్తున్నది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ.
- సీఎం జగన్‌

12.10PM
► రావిపాడు గ్రామ వలంటీర్‌ రజిత ప్రసంగం. వలంటీర్లు అందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన రజిత. ఏపీలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గొప్పదనం గురించి.. వాటి వల్ల లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాల గురించి వివరించిన వలంటీర్‌ రజిత.

12.05PM
► సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో వలంటీర్‌ వ్యవస్థ ద్వారా లబ్దిదారులకు అందుతున్న సేవల గురించి  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభా ప్రాంగణంలో చదివి వినిపించారు.

12.03PM
► ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదని.. సంకల్పం, ప్రజాసంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే సీఎం జగన్‌ లాంటి నేత రాష్ట్రానికి ఉంటే సరిపోతుందని ప్రసంగించారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవల్ని అందిస్తున్నారంటూ ఉదాహరణలతో సహా ప్రశంసలు గుప్పించారు ఆయన.   

11.48 AM
► వలంటీర్‌ వ్యవస్థ గురించి స్పెషల్‌ ఏవీ(ఆడియో విజువల్‌) ప్రదర్శన.

11.46 AM

► ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వలంటీర్లే వారధులన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌.

11.42 AM

► పెన్షన్‌ సహా ప్రతీ సేవల్ని ప్రజల ముంగిట చేరుస్తున్న వలంటీర్ల సేవలను కొనియాడిన అధికారులు.

► లాక్‌డౌన్‌ టైంలోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించిన వలంటీర్లపై ప్రత్యేక ప్రశంసలు. 

11.36 AM

► నరసరావుపేటలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌


► నరసరావుపేట, పల్నాడు జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమం.

► వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా.. మూడు కేటగిరీల్లో పురస్కారాలను అందించనున్న సీఎం జగన్‌.

► అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణం నడుమ వలంటీర్లకు అవార్డుల ప్రదానం.

11.26 AM
► సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. అధికారులతో ఆత్మీయ పలకరింపు.

10.57 AM
వలంటీర్ల అవార్డుల ప్రదాన కార్యక్రమం, బహిరంగ సభలో భాగంగా.. నరసరావుపేట చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.

10.42AM
► నరసరావుపేట బయలుదేరిన సీఎం జగన్‌. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు ఉన్నారు. 

► గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు సలాం అంటున్న ఏపీ ప్రజానీకం. నరసరావుపేటలో వలంటీర్లకు వందనం కార్యక్రమం.

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఏపీ వ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం.. ఇప్పుడు అభినందించేలా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అందుకే వాళ్ల సేవలకు ప్రోత్సాహకంగా ఇవాళ పల్నాడు నర్సరావుపేటలో నిర్వహించబోయే బహిరంగ సభలో సీఎం జగన్‌ సత్కరించనున్నారు.

► వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. 

► మొత్తం 2, 33, 333 మంది వలంటీర్లకు.. రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు. 

► సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్‌ వేవ్‌లో ఫీవర్‌ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. 

► సేవా వజ్ర,  సేవా రత్నతో పాటు కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారికి సేవా మిత్ర అవార్డు అందించనున్నారు.

► స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగసభలో పాల్గొని.. వలంటీర్లను సత్కరిస్తారు.

► పీఎన్‌సీ కళాశాల వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

► తాడేపల్లి నుంచి ముందుగా.. నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 

► ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (గురువారం) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు