Cyclone Yaas: అమిత్‌ షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌

24 May, 2021 12:02 IST|Sakshi

తుపాను హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతాం 

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, ఢిల్లీ: పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. యాస్‌ తుపాను హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుపాను కదలికలను పరిశీలిస్తే ఏపీ పై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని సీఎం వైఎస్ జగన్ వివరించారు.

చదవండి: ‘యాస్‌’ తుపాన్‌ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు
ఆనందయ్య మందుపై అపోహలొద్దు: ఆళ్ల నాని

మరిన్ని వార్తలు