పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్‌ సమీక్ష

26 Nov, 2020 14:13 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్, పోర్టులు, విమానాశ్రయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్ట్‌ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ సిటీకి బీచ్ రోడ్ నిర్మాణం పూర్తి కావాలన్నారు.

పోలవరం నుంచి విశాఖకు పైప్‌లైన్‌ ద్వారా తాగునీటి సరఫరాపై డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సంక్రాంతిలోగా శంకుస్థాపనలకు అధికారులు సన్నద్ధం కావాలని అధికారులను అప్రమత్తం చేశారు. హాజరైన మంత్రి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు