మీ అభిమానానికి, ఆప్యాయతకు నిజంగా పొంగిపోయా: సీఎం జగన్‌ కృతజ్ఞతలు

22 Dec, 2022 20:51 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్‌ చేశారు.

తనపై చూపిన అభిమానానికి, అప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్.. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. బుధవారం(డిసెంబర్‌ 21)న సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మిగతా చోట్ల కూడా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు