నేడు భీమవరం రానున్న సీఎం వైఎస్‌ జగన్‌

14 Aug, 2021 03:22 IST|Sakshi

భీమవరం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు రానున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరవుతారు. ఉదయం 11.15 గంటలకు వివాహ వేదిక కె–కన్వెన్షన్‌కు సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.20 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11.25 గంటలకు కల్యాణ మండపానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళతారు.  సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ నిబంధనల కారణంగా హెలిప్యాడ్‌ వద్దకు ప్రధానమైన వారిని మినహా ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు