మహాత్మా గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు సీఎం జగన్‌ నివాళులు

2 Oct, 2022 13:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ప్రముఖుల సేవలను స్మరించుకున్నారు. 

వారి ఆదర్శాలు, ఆలోచనలు సమాజ ఉన్నతి కోసం, దేశ పురోగతి కోసం మనం వేసే ప్రతి అడుగులో ప్రతిధ్వనిస్తాయని సీఎం జగన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు