సీఎం జగన్‌కు ఏపీ కమర్షియల్‌ ట్యాక్సెస్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు

11 May, 2022 08:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ కమర్షియల్‌ ట్యాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్‌ 2 సర్వీసెస్‌లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్‌ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కేఆర్‌ సూర్యనారాయణ, జనరల్‌ సెక్రటరీ జీఎం రమేష్‌కుమార్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్‌ జీఆర్‌వీ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.
చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ 

మరిన్ని వార్తలు