కార్యదర్శులతో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ సమీక్ష

13 Aug, 2021 19:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యదర్శులతో ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, హాజరు, ఈ-ఆఫీస్‌ దస్త్రాలపై చర్చించారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. సచివాలయంలో యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ-ఫైల్స్‌ ఉన్నా.. వ్యక్తిగత దస్త్రాలపై వివరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఈ-ఫైలింగ్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు