ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డ్‌

1 Apr, 2022 18:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డ్‌ సృష్టించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం దాటింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా మార్చి నెల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే 2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.

చదవండి: ట్రావెల్‌​ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ సీన్‌..

రాష్ట్ర విభజన అనంతరం అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోయిన ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ రావడంతో ఆదాయం పెరిగినట్లు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ(స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ)  తెలిపారు.

మరిన్ని వార్తలు