నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి

20 Apr, 2021 16:24 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

న్యాయం నావైపే ఉంటుంది: పుష్ప శ్రీ వాణి

సాక్షి, విజయనగరం: తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తాను ఎస్టీ కొండ దొర కులానికి చెందిన వ్యక్తిని అన్నారు. తన సోదరి స్పెషల్‌ డీఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. ‘‘నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డీఎస్సీలో పోస్టు వెనుకకి తీసుకున్నారు. కులం కారణం కాదు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదు. 2014 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు రిటర్నింగ్ అధికారికి అనర్హత వేటు వేయాలని కొందరు ఫిర్యాదు చేశారు’’ అని పుష్ప శ్రీ వాణి తెలిపారు. 

‘‘అయితే, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్డీవో కాకుండా ఎమ్మార్వో ఇవ్వచ్చొన్న నిబంధన ఉందని… ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నాం. దీనిపై విచారణ జరుగుతుంది. నిజాలు త్వరలోనే తేలుతాయి. రాజకీయంగా కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. వాళ్లకీ తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. కానీ అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం నావైపే ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు పుష్ప శ్రీవాణి.

చదవండి: గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్‌: పుష్పశ్రీవాణి

మరిన్ని వార్తలు