ఆ నలుగురి మరణం ‘పోలీస్‌ కుటుంబానికి తీరని లోటు’

23 Aug, 2021 16:44 IST|Sakshi

‘శ్రీకాకుళం ఘటన’పై ఏపీ డీజీపీ దిగ్ర్భాంతి

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో  నలుగురు ఏ‌ఆర్  పోలీసులు మృతి చెందడం తమ పోలీస్‌ కుటుంబానికి తీరని లోటు అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ప్రమాద  ఘటనపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, ఎస్పీని ఆదేశించారు. (చదవండి: ‘హీరోయిన్‌లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’)

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరణించిన పోలీస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ప్రకటించారు. కలకత్తాలో మరణించిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి)

మరిన్ని వార్తలు