బాలమిత్ర పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం

1 Oct, 2020 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జువైనల్‌ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ జరిగింది. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననుండగా..  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఐడీ చీఫ్ సునీల్ ‌కుమార్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి గల కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదానిపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగం అని స్పష్టం చేశారు గౌతమ్‌ సవాంగ్‌. (చదవండి: ఆ దాడి చేసింది టీడీపీ కార్యకర్తే)

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనేక మంది చిన్నారులకు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెమినార్‌లో అనేక అంశాలు చర్చించాము. చర్చించిన ప్రతి అంశాన్ని పరిష్కారం అయే విధంగా చర్యలు తీసుకుంటాం అని గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు