సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్ పరీక్ష

31 Jul, 2021 13:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌) పరీక్ష సెప్టెంబర్‌19న నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది. అలాగే వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం కల్పించింది. ఏపీ ఈసెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్‌/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్‌ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని వీసీ రంగజనార్ధన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు