ఏపీ ఎడ్‌ సెట్‌ ఫలితాలు విడుదల

12 Oct, 2021 17:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయ విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎడ్‌సెట్‌ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్‌ విశ్వేశ్వర్‌రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.  కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు