AP EDCET 2022: ఏపీ ఎడ్‌ సెట్‌ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదల

20 Oct, 2022 16:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఏపీ ఎడ్‌ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు గురువారం షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ ఎడ్‌ సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే రామమోహన్ రావు షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఎడ్‌సెట్‌ ఫస్ట్‌ ఫేజ్‌ అడ్మిషన్లకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కాన్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టగా.. 26 నుంచి 31 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుందని తెలిపారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న విజయవాడ లయోలా కాలేజ్‌లో సర్టిఫికేట్లు పరిశీలించన్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ ఒకటి నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా.. నవంబర్ మూడో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పుకి అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 5న విద్యార్ధులకు సీట్ల కేటాయించనున్నారు. నవంబర్ 7నుంచి 9లోపు కళాశాలలో చేరేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. నవంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు