ఏపీ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

27 Aug, 2020 19:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎంసెట్ సహా ఏడు సెట్ల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని భద్రతా సదుపాయాలు కల్పించాలన్నారు. ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంసెట్ కు ఈ ఏడాది లక్షా 84 వేలమంది హాజరకానున్నారని అన్నారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐ సెట్ నిర్వహిస్తామని, ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల 839 మంది హాజరవుతున్నారని మంత్రి సురేష్‌ వెల్లడించారు. మొత్తం అన్ని ప్రవేశ పరీక్షలకు 4 లక్షల 36 వేల మంది హాజరుకానున్నట్లు మంత్రి ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు