ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలి..

21 Jan, 2021 15:21 IST|Sakshi

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్‌

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేయాలని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లమని కోరుతున్నామని జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చదవండి: ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేం..
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవ్వకుండా ఎన్నికల్లో పాల్గొనలేమని.. ఓ వైపు వ్యాక్సిన్, మరో వైపు ఎన్నికలు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరిగాయని.. ఎన్నికల కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు