సీఎస్‌ ఆదిత్యనాథ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ

26 Jan, 2021 19:38 IST|Sakshi

ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు

సాక్షి, విజయవాడ: సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ చర్చించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్‌ కోరారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని.. ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. త్వరలో వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. సీఎస్‌ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎస్‌ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..?

సీఎస్‌ సానుకూలంగా స్పందించారు..
ఉద్యోగుల సమస్యల పట్ల సీఎస్‌ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సెక్రటరీ బండి శ్రీనివాస్‌ తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. ఉద్యోగులకు ఏమీ జరిగినా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌దే బాధ్యత అని తెలిపారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’

పీపీఈ కిట్లు ఇవ్వాలి..
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు కోరారు. రేపటి భేటీలో ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు