ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి

20 Jul, 2022 11:04 IST|Sakshi

 సాక్షి, తూర్పుగోదావరి:  ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం(బుధవారం ఉదయం నాటికి) 16.50 అడుగులకు చేరుకుంది వరద నీటిమట్టం. సుమారు 17 లక్షల 15 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి బాగా తగ్గింది. ప్రాజెక్ట్స్ స్పీల్వే  వద్ద 34.6 మీటర్లకు చేరుకుంది వరద నీరు. 48 గేట్ల ద్వారా దిగువకు 15.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు.

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 2,52,967 క్యూసెక్కులు  కాగా, ఔట్ ఫ్లో : 19,070 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.00 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 168.2670 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు