కర్తవ్య దీక్షకు పునరంకితం కావాలి..

1 Nov, 2020 12:18 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

సాక్షి, తాడేపల్లి: గత పాలకుల వల్లే ఆరేళ్లుగా విభజన అన్యాయం జరిగిందని, రాష్ట్రం వెనుకబాటుతో కున్నారిళ్లిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్‌ గాడినపెట్టారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌.. దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్)‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం గుర్తుంచుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. ‘‘తెలుగువారందరి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ నేతృత్వంలో సఫలం చేస్తాం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ప్రజల్లో మమేకం అయ్యి, అభివృద్ధి దిశగా కర్తవ్య దీక్షకు పునరంకితం అవ్వాలి. సీఎం జగన్ వెంట మడమ తిప్పని సైనికులు గా పని చేయాలని’’ ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1)

>
మరిన్ని వార్తలు