వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ  దినోత్సవం

1 Nov, 2021 10:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళర్పించారు.

(చదవండి: AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని టీడీపీ ప్రభుత్వం జరపలేదని.. అప్పట్లో వేడుకలు జరపకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.

చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం

మరిన్ని వార్తలు