డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నా: గౌతమ్‌ సవాంగ్‌

1 Feb, 2021 16:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గత నాలుగు రోజులుగా పోలీసులు పలు ఛాలెంజ్‌లు ఎదుర్కొంటున్నారని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిగా పోలీసులకు వేక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం రావడంతో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనేదానిపై పోలీసు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ సెకండ్ ఫేజ్‌లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ ఉంటారని, పొలీసులు గ్రామస్థాయిలో కచ్చితంగా పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. బందోబస్తు పోలీసులు వ్యాక్సినేషన్‌కు వెళ్ళడానికి వారి ఎలక్షన్ బాధ్యతలు వదిలి వెళ్ళాల్సి వస్తుందని డీజీపీ తెలిపారు. చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి పోలీసులు పనిచేయాల్సి వస్తుందని గౌతమ్‌ సవాంత్‌ తెలిపారు. ఎలక్షన్ ఫేజ్‌లో పోలీసులు ఉండే ప్రాంతం మారిపోతుందున్నారు. రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహించడానికి తాము వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని త్యాగం చేస్తాం అని పోలీసు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల‌ దృష్ట్యా పోలీసు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయానికి తాను గౌరవిస్తున్నానన్నారు. ప్రజా సంక్షేమం ముందు, స్వ ప్రయోజనాలు తరువాత అని నిర్ణయించిన పోలీసు ఉద్యోగులకు డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నానని తెలిపారు. ఏపీ పోలీస్ ఒక నిబద్ధతతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ పని చేస్తున్న కొంత మంది రాజకీయ నాయకులు అడుగడుగునా రాజకియం చేస్తున్నారని, టెక్కలిలో సీఐపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది సిస్‌లో ఉండకూడా.. వెనక ఉండి నడిపిస్తున్నారని తెలిపారు. విచారణ చేస్తున్నామని, ఎలాంటి వారైన వదిలే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు