నెరవేరిన దశాబ్దాల కల.. సీఎం జగన్‌కు థాంక్స్‌ చెప్పిన కుప్పం ప్రజలు

31 Mar, 2022 15:56 IST|Sakshi
కుప్పం వ్యూ

కుప్పం(చిత్తూరు జిల్లా): జిల్లా సరిహద్దులోని కుప్పం కేంద్రంగా సరికొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేరుస్తున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ భరత్‌ కృషి ఫలించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు చేయలేని పనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేశారని ప్రజానీకం కొనియాడుతోంది. తమ కల నెరవేర్చిన సీఎంకు కుప్పం ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు.

చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్‌

ప్రజల ఆకాంక్షల మేరకు.. 
కుప్పం రెవెన్యూ డివిజన్‌కోసం స్థానికులు ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదన తీసుకెళ్లాం. డివిజన్‌ చేస్తే ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధిని వివరించాం. ఆయన సానుకూలంగా స్పందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు.  
– ఎమ్మెల్సీ భరత్‌
 

మరిన్ని వార్తలు