పరిశ్రమలపై రాయితీల జల్లు 

9 Feb, 2023 16:34 IST|Sakshi

ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలకు ప్రభుత్వ సాయం 

ఏటా రూ. 80 కోట్ల వరకు రాయితీ

జిల్లాలో 11 ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు

ఏడాదికి 2400 మిలియన్‌ యూనిట్స్‌ వినియోగం

విజయనగరం ఫోర్ట్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు ఆర్థిక ఊతం అందిస్తోంది. రాయితీల జల్లు కురిపిస్తోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలకు విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. బిల్లుల భారం తగ్గించి అధిక ఉత్పాదకతకు తోడ్పాటునందిస్తోంది. జిల్లాలో సగానికిపైగా విద్యుత్‌ను వినియోగించే  ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమల ఆర్థిక వృద్ధికి విద్యుత్‌ రాయితీలు ఉపయోగపడుతున్నా యి.  

పరిశ్రమలు ఇలా..   
జిల్లాలో 11 ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఫేకర్‌ ఎల్లాయీస్‌ లిమిటెడ్, హిరఎలక్ట్రో స్మిల్టర్స్‌ పీవీటీ లిమిటెడ్,  ఆంజనేయ ఫెర్రో ఎల్లాయీస్‌ లిమిటెడ్, మీడీఏ మినరల్‌ దాతు ప్రైవేట్‌ లిమిటెడ్,  మోరో ఎల్లాయీస్‌ పీవీటీ లిమిటెడ్, సిరి స్మిల్టర్స్‌ ఎనర్జీపీవీటీ లిమిటెడ్, జిందాల్‌ స్టేషనల్స్‌ లిమిటెడ్, ఆరో శ్రీ వెంకటేశ్వర స్వామి స్టీల్స్, డెక్కన్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ లిమిటెడ్, శ్రీ మహలక్ష్మి స్మిల్టర్స్‌ పీవీటీ లిమిటెడ్, బెర్రా ఎల్లాయీస్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు ఉన్నాయి.  

ఏడాదికి రూ.80 కోట్ల వరకు రాయితీ   
ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 80 కోట్లు వరకు విద్యుత్‌ రాయితీ కల్పిస్తోంది. ఏడాదికి జిల్లాలో అన్ని రకాల విద్యుత్‌ కనెక్షన్లకు కలిపి 3,252 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతోంది. వీటిలో ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు 2,400 మిలియన్‌ యూనిట్ల  విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 852 మిలియన్‌ యూనిట్లు మిగతా విద్యుత్‌ వినియోగదారులు వినియోగిస్తున్నారు.  

పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదం  
ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. ఏడాదికి రూ.77.93 కోట్ల విలువైన్‌ విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తున్నాం. ఇది పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.  
 – పి.నాగేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ  

మరిన్ని వార్తలు