ఉపాధి హామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు

1 Jul, 2021 17:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధిహామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. లక్ష్యాన్ని మించి పనిదినాలను కల్పించిన ప్రభుత్వ యంత్రాంగం చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జూన్‌ 30 నాటికి 16 కోట్ల పనిదినాలు కల్పించాల్సిం ఉండగా.. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16.7 కోట్ల పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా లక్ష్యం చేరుకోవడంలో ఎంతో శ్రమించిన ఉద్యోగులను పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రశంసించారు.

మరిన్ని వార్తలు