హర్‌ ఘర్‌ తిరంగా ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

6 Aug, 2022 16:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ‘హార్ ఘర్ తీరంగా’ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వాప్తంగా కోటి జాతీయ జెండాలు ఎగరేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలో హార్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 12న జరిగే హార్ ఘర్ తిరంగాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే కోటి జెండాలను వివిధ శాఖల ద్వారా కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది.

కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జెండా ఎగిరేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు