జూనియర్‌ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

24 Aug, 2021 20:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని  స్కూల్‌లు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో  తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్‌ ఖరారు చేసింది. నర్సరీ నుంచి టెన్త్‌ వరకు ఫీజులు నిర్ణయించింది. ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్‌ విద్యకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు..ప్రైమరీ విద్యకు రూ.11,000, హైస్కూల్‌ విద్యకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు.. ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్‌ విద్యకు రూ.18000 నిర్ణయించారు.

ఇక గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 గా నిర్ణయించారు.

చదవండి:Vijayawada: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు