బాలల బంగారు భవితకు సర్కార్‌ భరోసా 

6 Nov, 2020 07:50 IST|Sakshi

పేదరికంతో వీధులపాలు.. చదువులకు దూరం 

70 శాతం మందికి దారిద్య్రమే శాపం 

76 శాతం మంది ఇంటికి దూరమై జీవిస్తున్నవారిలో 15 ఏళ్లలోపువారే 

ఆపరేషన్‌ ముస్కాన్‌లో దొరికిన బాలల దయనీయ జీవనం 

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో విద్యావంతులుగా చేయొచ్చంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: ‘మా అమ్మానాన్న పొలం పనులకు వెళ్లినా కుటుంబం గడవడం లేదు.. అందుకే నన్ను భిక్షాటన చేయిస్తున్నారు.. మా తమ్ముడిని చదివిస్తున్నారు.. నాకూ చదువుకోవాలని ఉంది సార్‌.. బాగా చదువుకుని టీచర్‌ను అవుతాను.. నన్ను చదివిస్తారా’ ఇది ప్రకాశం జిల్లాకు చెందిన పదేళ్ల చిన్నారి సలోమి వేడుకోలు  

‘మా అమ్మ చనిపోయింది. మా నాన్న రోజుకు వంద రూపాయలు వస్తాయని నన్ను బట్టల కొట్టులో పెట్టాడు. నన్ను చదివిస్తే పోలీస్‌ అవుతాను సార్‌’.. ఇది విజయనగరం జిల్లాలో పోలీసులకు దొరికిన ఏడేళ్ల బాలిక యామిని విన్నపం 

‘మా అమ్మ ఇంటింటికీ వెళ్లి పాచి పనిచేసినా ఇల్లు గడవడం లేదు. రోజుకు రూ.150 కోసం నన్ను హోటల్‌లో అంట్లు కడిగే పనిలో పెట్టింది. నాకు చదువుకోవాలని ఉంది. నన్ను చదివిస్తే ఆర్మీలో చేరతాను’.. ఇది కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన చరణ్‌ వెంకట్‌ వినతి 

ఇవి.. ఆపరేషన్‌ ముస్కాన్‌లో పోలీసులు సంరక్షించిన చిన్నారుల దయనీయ గాథలు. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏ ఒక్క బాలుడు, బాలికను కదిలించినా తమ దుస్థితిని ఏకరువు పెట్టారు. తమకూ చదువుకోవాలని ఉందని.. చదివిస్తే అందరిలా ఉన్నతంగా ఎదుగుతామంటూ కోరికను వ్యక్తం చేశారు. వీరంతా తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల నుంచి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో వెబినార్‌ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నవారే. బడిలో ఉండాల్సిన బాలలు వీధి బాలలుగా మగ్గిపోవడానికి ప్రధాన కారణం.. వారి పేదరికమే. మూడో విడత ఆపరేషన్‌ ముస్కాన్‌లో దొరికిన వీధి బాలల వాస్తవ పరిస్థితిపై విశ్లేషణ..
 

బాలల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట 
చిన్నారులు, బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దవచ్చని అధికారులు తెలిపారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుని వీధి బాలలను కూడా విద్యావంతులను చేస్తామని చెబుతున్నారు.

  

మరిన్ని వార్తలు