అలా చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

21 Oct, 2020 18:50 IST|Sakshi

వాహన జరిమానాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి : వాహన నిబంధన ఉల్లంఘనపై జరిమానాలను భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి 7సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు, రెండోసారికి రూ.10వేలు, పర్మిట్‌లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహానాల బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40వేలు, ఓవర్‌ లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు జరిమానా విధించనుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పెంచిన జరిమానాలు

  • వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750 
  • సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750 
  • అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000
  • అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000
  • రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000
  • వేగంగా బండి నడిపితే - రూ. 1000
  • సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000
  • రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
  • రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
  • పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000
  • ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
  • వాహనం బరువు చెకింగ్  కోసం ఆపక పోయినా - రూ. 40000
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000
  • అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
  • రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష
     
మరిన్ని వార్తలు