అమరావతి పంట బీమాకు దివంగత నేత పేరు

3 Nov, 2020 15:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి పంటల భీమాకు వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకంగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గాను పంటల భీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019-20 సంవత్సరంలో రబీ సీజన్ 2020 ఖరీఫ్ పంటకు కూడా అమలయ్యేలా ఈ పంట బీమా  వర్తించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.

అంతేగాక ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉచిత పంట బీమా కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల సమీకృత అక్వా ల్యాబబ్‌ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఆర్ఐడీఎఫ్ నిధులు 12. 47 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు