వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

8 Jun, 2021 16:48 IST|Sakshi

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌

చిన్నారులపై థర్డ్‌వేవ్‌ ప్రభావం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నారులపై థర్డ్‌వేవ్‌ ప్రభావం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ మేరకు అర్హులైన తల్లులకు వ్యాక్సిన్‌ వేయించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒకరోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. 

టోకన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్‌ వేయించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. 5 ఏళ్ల లోపు చిన్నారులతో పాటు ఉన్న తల్లులకి వ్యాక్సిన్ వేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. అర్హులైన తల్లులు 15 నుంచి 20 లక్షల మంది ఉంటారని అంచనా. కోవిడ్‌ వచ్చిన చిన్నారులతోపాటు తల్లులను సహాయకులుగా ఆస్పత్రుల్లో ఉంచాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక ఇచ్చింది.

చదవండి: జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌ 
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

మరిన్ని వార్తలు