పెద్దిరెడ్డి, బొత్సకు కీలక శాఖల కేటాయింపు

21 Sep, 2020 18:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది. అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్‌ సరికొత్త యాప్‌)

కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166 అధికరణలో గల క్లాజ్‌(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ఆరులోని సబ్‌ రూల్‌(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు