డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

24 Aug, 2020 18:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్‌ సంచులను పంపిణీ చేయనుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు