కృష్ణా జలాలపై సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్‌

12 Jul, 2021 22:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అక్రమాలపై దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్‌ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, వాటి నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొనే అవకాశం ఉంది.

ఈ విషయమై తెలంగాణ సర్కార్‌ తీసుకొచ్చిన అక్రమ జీవోను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, కేఆర్‌ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. రైతులు, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని, విలువైన జలాలు సముద్రంలోకి కలిసేలా పరిస్థితులను సృష్టించి, మానవ హక్కులను ఉల్లంఘినలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. 

>
మరిన్ని వార్తలు