Corona Virus: ఏపీలో కొత్తగా 1,010  కరోనా కేసులు

30 Sep, 2021 17:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,054 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,010 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,176 కు చేరింది. 

ఒకరోజులో 1,149  మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 11,503కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50,324 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

చదవండి: TS: కేంద్రం తోడ్పాటు.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి

మరిన్ని వార్తలు