ఏపీలో​ కొత్తగా 12,634 కరోనా కేసులు..

25 Apr, 2021 18:32 IST|Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 62,885 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, ఈరోజు..  ఏపీలో 69 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,304 మంది కోలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా 9 లక్షల 36వేల 143 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం 89,732  యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,59,94,607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు